జాజాల సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
రామారెడ్డి, జూలై 17: మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గోగు భూపాల్‌రెడ్డి, లెంకల మోహన్‌రెడ్డి, ఆకుల రమేశ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జాజాల సురేందర్ నివాసంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రంలో రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు గురజాల నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు, మాజీ సర్పంచ్ గంగారాంతోపాటు ఉప్పల్వాయి గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

