నవీపేట, నవంబర్ 9: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు గురువారం నగరంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. భారత జాగృతి యువ నాయకుడు జాదవ్రాజ్ ఆధ్వర్యంలో బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు రమణ, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు నరేశ్, మద్దేపల్లికి చెందిన 30 మంది బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్సీ కవిత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
నవీపేట,నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న సిద్ధ్దాంతాలు నచ్చక భారత జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు ఆధ్వర్యంలో తిరిగి బీఆర్ఎస్లో చేరినట్లు జన్నేపల్లి మాజీ ఉప సర్పంచ్ వీరేందర్రావు పేర్కొన్నారు. వీరేందర్రావు ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరాడు. తిగిరి బీఆర్ఎస్లో చేరిన వీరేందర్రావును పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు గులాబీ కండడా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నాయకులు దొంత ప్రవీణ్‌కుమార్, కృష్ణమోహన్‌రావు, నీరడి బుచ్చన్న, బెల్లాల్ నర్సింగ్‌రావు, అల్లం రమేశ్, ఉమర్, గైని మోహన్, అజ్జూ, ఖలీమ్ తదితరులు ఉన్నారు.
శక్కర్‌నగర్, నవంబర్ 9: బోధన్ పట్టణం ఆచన్‌పల్లిలో ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ నివాసంలో ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాతాలం శ్రీనివాస్, వార్డు సభ్యుడు కొడితె శ్రీనివాస్‌రావుతోపాటు బోయిని గంగారాం గురువారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జైతాపూర్‌కు చెందిన సీనియర్ పార్టీ నాయకుడు ఉండి నాగేందర్‌రెడ్డి, ఎడపల్లి మండల భారత జాగృతి అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.