ఖలీల్వాడి, మార్చి 12 : నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన రాజశేఖర్ తన రక్తంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్రపటాన్ని గీయించి అభిమానాన్ని చాటుకున్నాడు.
నేడు (గురువారం) ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజును పురస్కరించుకొని ఆమెను హైదరాబాద్లోని నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఫ్రేమ్ కట్టించిన చిత్రపటాన్ని బహూకరించి, ఎమ్మెల్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.