బోధన్/ ఎడపల్లి/ రెంజల్/ భీమ్‌గల్, జనవరి3 :బోధనోపకరణాలతో ఉపాధ్యాయులు బోధన చేస్తే విద్యార్థుల్లో ప్రతిభ పెరగడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశాలుంటాయని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. మంగళవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎల్ఎం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతితో కలిసి ప్రారంభించారు. ఆర్డీవో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఈ ప్రదర్శనలో తయారుచేసి ప్రదర్శించిన బోధనా పరికరాలు బాగున్నాయన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి నర్రా రామారావు, ఎంఈవో నాగనాధ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నాగయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంబెల్లి శంకర్, నెమలి సంజీవ్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల స్థాయి బోధన ఉపకరణాల మేళాను ఎడపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. తరగతి గదుల్లో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు బోధన సామగ్రిని ప్రదర్శించారు. ప్రదర్శనలను జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ రజితా యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో రామారావు, సర్పంచ్ ఆకుల మాధవి, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రెంజల్ మండల స్థాయి బోధన ఉపకరణాల మేళాను సాటాపూర్ యూపీఎస్ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. మేళాను సర్పంచ్ వికార్‌పాషా, ఎంపీపీ రజిని, జడ్పీటీసీ విజయ, సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈవో గణేశ్‌రావు, ఎంపీడీవో శంకర్, ఎంపీవో గౌసొద్దీన్, సర్పంచులు రమేశ్‌కుమార్, శ్రీదేవి, సాయిలు, మతురాబాయి, లలితారాఘవేందర్, పీఆర్టీయూ మండల బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి బోధన వ్యవస్థ సామగ్రి ప్రదర్శన మేళా కార్యక్రమాన్ని భీమ్‌గల్ మండలం బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈవో స్వామి, ఎంపీడీవో రాజేశ్వర్, మండల నోడల్ అధికారి శంకర్, సర్పంచ్ అతీక్, మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హరినాథ్, రఘువాస్, రాజేందర్, హెచ్ఎం చారి తదితరులు పాల్గొన్నారు.