బాన్సువాడ రూరల్ : కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని, ప్రతి విద్యార్థి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi ) విద్యార్థులకు సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో, డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పదో తరగతి వసతి గృహ విద్యార్థులకు విజయ స్ఫూర్తి (Vijaya Spurthy) ప్రేరణ అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పదో తరగతి ఎంతో కీలకమని, వార్షిక పరీక్షలకు కష్టపడి చదివి, మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని అన్నారు. కార్యక్రమంలో వసతి గృహ వార్డెన్లు లక్ష్మణ్, పవన్, శివరాం, విజయ భారతి,గంగాసుధ, విజయశాంతి, చంద్రకాంత్, శారద, సందీప్ కృష్ణ, దశరథ్, వెంకటేష్, చక్రధర్, తదితరులు పాల్గొన్నారు.