సిరికొండ : గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రామకృష్ణ ( SI Ramakrishna ) సూచించారు. మన ఊరు- మన భద్రత- మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతని గుర్తు చేశారు. గ్రామ ప్రజల్లో భద్రతాపై అవగాహన పెంపొందించడం , ప్రజల భాగస్వామ్యంతో సురక్షిత సమాజ నిర్మాణానికి ప్రోత్సాహం కల్పించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.
ప్రజలకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, పిల్లల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం పొందే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.