ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబురాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అలిగిన బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ చేరి మహిళలు ఆడిపాడారు. అనంతరం గ్రామ శివారులోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. గ్రామాల్లోని చౌరస్తాలన్నీ పూలవనాలను తలపించగా.. ఆడపడుచులతో సందడిగా మారాయి.