ఆర్మూర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ( Womens Day ) సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బార్ అసోసియేషన్ ( Bar Association ) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టులోని మహిళా జడ్జిలను సన్మానించారు. సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా ( Naseem Sultana ), జూనియర్ సివిల్ జడ్జి దీప్తి ( Deepti ) లను సన్మానించారు.
సన్మానగ్రహితలు మాట్లాడుతూ మహిళ చట్టాలపై ప్రతి ఒక్క మహిళ అవగాహన పెంచుకోవాలని సూచించారు. మహిళా హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, అందుకు చదవు, చట్టాలపై అవగాహన ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.