Balkonda | ముప్కాల్, జనవరి 20 : బాల్కొండ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు నిజామాబాద్ జిల్లా స్థాయి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్, స్కర్ట్ సంయుక్తం గా నిర్వహించిన రెసిడెన్షియల్ విభాగంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు మొదటి, రెండో స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు.
జిల్లాలోని మోడల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థుల రెసిడెన్షియల్ కేటగిరిలో ఈ విద్యార్థులు ప్రతిభ చూపడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు ఏంజలీనా, రశ్మిత, మనస్విక, కష్వాలను అభినందించారు. ఆంగ్ల భాషను నేర్చుకుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని సూచించారు. విద్యార్థులు ఆంగ్లభాషపై పట్టు సాధించడంతోపాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ఎల్లప్పుడు ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన గైడ్ టీచర్ శ్రీనివాస్ రాజుని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దత్తు, ఏవీ గణేష్, సుకుమార్, శ్రావణి, విజయలక్ష్మి, శ్రీకాంత్, భీమరాజ్, లక్ష్మీనారాయణ, రవి, రేష్మ తదితరులు పాల్గొన్నారు.