బాల్కొండ : పాఠశాలల్లో కంప్యూటర్( Computer Study) విద్యను అమలు చేయడంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన బాల్కొండ (Balkonda ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పది డెస్క్ టాప్ కంప్యూటర్లు చేరాయి. వీటితో పాటు ఒక ప్రింటర్(Printer), పది హెడ్ ఫోన్లు, 2 కేవీ ఇన్వర్టర్ల చొప్పున మొత్తం సుమారు 7 లక్షల విలువ గల సామాగ్రి పాఠశాలకు అందిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ( MEO Battu Rajeshwar) తెలిపారు.
పాఠశాలలో కంప్యూటర్ విద్య విద్యార్థుల కెరీర్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ విద్యార్థులలకు కొత్త నైపుణ్యాలు, ప్రస్తుత పాఠాల అధునాతన వెర్షన్లు నేర్చుకోవడానికి దోహద పడనుందని వెల్లడించారు. వచ్చిన సామగ్రిని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్తో కలిసి పరిశీలించారు.