పెద్దవాగులో ఇసుక దొంగలు
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతున్నది. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో అక్రమ దందాకు ఎదు రే లేకుండా పోతున్నది. ఇసుక ఇక్రమ రవాణా విషయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్‌గా ఉన్నప్పటికీ, మండల స్థాయిలో మాత్రం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
- ట్రాక్టర్‌కు రూ.50 వేల చొప్పున చెల్లిస్తే చాలు
- జాతీయ రహదారికి ఆనుకునే అక్రమ తవ్వకాలు
- హైవే మీదుగానే తరలిపోతున్న ఇసుక వాహనాలు
- అయినా పట్టించుకోని అధికారులు, పోలీసులు
మోర్తాడ్, మే 22: బాల్కొండ నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతున్నది. అధికార యంత్రాంగం కళ్లు మూసుకోవడంతో అక్రమ దందాకు ఎదు రే లేకుండా పోతున్నది. ఇసుక ఇక్రమ రవాణా విషయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్‌గా ఉన్నప్పటికీ, మండల స్థాయిలో మాత్రం అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుక దొంగలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి తవ్వకాలతో సహజ సంపదను కొల్లగొడుతున్నారు. ఎవరైతే మాకేంటి.. మేం తగ్గేదేలే అన్న రీతిలో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే గోదావరి సహా అనేక వాగులు చెరబట్టగా, తాజాగా మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వాలిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. చిమ్మచీకట్లో గుట్టుగా ట్రాక్టర్లలో అక్రమంగా తరలించుకు పోతున్నారు.
స్థానికుల్లో ఆందోళన
సరిగ్గా రెండునెలల క్రితమే గాండ్లపేట్ పెద్దవాగు నుంచి అక్రమ ఇసుక రవాణా కొనసాగింది. ఆ సమయంలోనే నానా రభస జరిగింది. అక్రమ ఇసుక రవాణా విషయంలో రెండువర్గాల మధ్య గొడవలు జరగడం, జరిమానాలు చెల్లించే వరకు పరిస్థితి దిగజారడంతో ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో గాండ్లపేట్‌లో తిరిగి ఇసుక అక్రమ రవాణా కావడం, ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి గొడవలు జరుగుతాయోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతున్నది.
రూ.50 వేలు చెల్లిస్తే చాలు..
గాండ్లపేట్ పెద్దవాగు నుంచి ఇసుక రవాణాకు అధికారుల అనుమతి అవసరం లేదు. గ్రామ కమిటీకి రూ.50 వేలు చెల్లిస్తే సరిపోతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో వీడీసీ డబ్బులు ముట్టజెప్పిన అక్రమార్కులు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాత వాగులోకి ట్రాక్టర్లు వెళ్లడం ప్రారంభమవుతుంది, ఉదయం 6 గంటల వరకు అక్రమ రవాణా కొనసాగుతుంది. అక్రమ ఇసుక తవ్వకాలకు జేసీబీని సైతం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గాండ్లపేట్ పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం, ఇసుక ట్రాక్టర్లు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జాతీయ రహదారిపైనే పయనిస్తున్నా అటు పోలీసులు కానీ, ఇటు అధికారులు కానీ పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఇదే పరిస్థితి శెట్పల్లి గ్రామంలో కూడా కొనసాగుతున్నది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై కింది అధికారులు పట్టించుకోని తరుణంలో కలెక్టర్ స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అసలు సూత్రధారులెవరు, అధికారుల పాత్ర ఏమిటనే అంశాలపై విచారణ జరిపించాలని, అలాగే వీడీసీల వసూళ్లకు బ్రేక్ వేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతులు లేవు..
మోర్తాడ్ మండలంలోని పాలెం పెద్దవాగు నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నవి. కానీ, గాండ్లపేట్, శెట్పల్లి గ్రామాల నుంచి ఇసుకను తరలించేందుకు ఎటువంటి అనుమతులూ లేవు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటాం.
– కృష్ణ, మోర్తాడ్ తహసీల్దార్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

