Sirikonda | పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : బాజిరెడ్డి జగన్
వడగండ్ల వానకు పాటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇంచార్జి బాజిరెడ్డి జగన్ అన్నారు.
సిరికొండ, ఏప్రిల్22 : వడగండ్ల వానకు పాటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఇంచార్జి బాజిరెడ్డి జగన్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా మండలంలోని తాటిపల్లి గ్రామంలో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. సుమారు 700 ఎకరాలకు పంట నష్టం జరిగిందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పై అధికారులకు నివేదికను సమర్పించారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని అని డిమాండ్ చేశారు.
గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య సబ్ స్టేషన్ మంజురై శంకుస్థాపన చేసి సంవత్సరం గడిచిన నేటికి పనులు ప్రారంభం కాలేదని, ఎవరు అడ్డుకుంటున్నారో తెలుపాలని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి సిరికొండ మండల కేంద్రంలో ధర్నా చేపడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ తోట రాజన్న, గ్రామ ఉప సర్పంచ్ దేవేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు మాలోత్ తిరుపతి, నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజయ్, బానోత్ గోపాల్ నాయక్, భూషణ్ రెడ్డి, సతీష్ రెడ్డి, చలపతి, సాగర్, తిరుపతి, గంగాధర్, ప్రకాష్, రమేష్, మోహన్, రామ్ చందర్, లాల్సింగ్, శంకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

