TMRPS | కంటేశ్వర్, డిసెంబర్ 6 : బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని టీఎంఆర్పీఎస్ మల్లని శివ పేర్కొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శివ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జీజీ కాలేజ్ హాస్టల్లో టీఎంఆర్పీఎస్, టీఎంఎస్ఎఫ్ నాయకులతో కలిసి శనివారం మహనీయునికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ నిమ్మ జాతులకు హక్కులు అందించిన దేవుడని, తన ఆశయాలు, ఆలోచన విధానాలు కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలెం వంశిరాజ్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ మాదిగ, నాయకులు లక్ష్మణ్, సత్యం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.