ఖలీల్‌వాడి, డిసెంబర్ 7 : నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలి రోజు విశేస స్పందన లభించింది. శనివారం ఉదయం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది. పాత కలెక్టరేట్ మైదానంలో ప్రముఖ కార్లు, ద్విచక్రవాహన కంపెనీలతో ఏర్పాటైన ఆటో షోను మేయర్ నీతూకిరణ్ లాంఛనంగా ప్రారంభించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన అధునాతన వాహనాలను పరిశీలించారు. లేటెస్ట్ డిజైన్లతో ఎలక్ట్రికల్ వాహనాలు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. కొనుగోలుదారులకు లోన్లు ఇచ్చేందుకు అక్కడే బ్యాంకర్లు స్టాళ్లు ఏర్పాటు చేయడం చూసి అభినందించారు. వాహన ప్రదర్శనలో కారు కొనుగోలు చేసిన వ్యక్తికి తాళం అందజేశారు.
అనంతరం మేయర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన ఆటో షో, ప్రాపర్టీ షో వంటి వాటిని ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ నిజామాబాద్ లాంటి ద్వితీయశ్రేణి నగరాలకు తీసుకురావడం అభినందనీయమన్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల వాహనాలను, అలాగే రుణ సదుపాయం పొందేందుకు బ్యాంకర్లను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రశంసనీయమన్నారు. నాలుగోసారి వాహన ప్రదర్శన ఏర్పాటు చేయడం బాగుందన్నారు. రెండ్రోజుల పాటు నిర్వహించనున్న వాహన ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆటో షోకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఉదయం నుంచి సందర్శకులు తరలివచ్చారు. అధునాతన కార్లు, బైక్‌లు టెస్టు డ్రైవ్ చేశారు. ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, వాహనాల విక్రయాలు, బుకింగ్‌లు జరగడంతో ఆయా కంపెనీల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్బీఐ డీజీఎం బిజయ్ సాహు, ఆర్ఎం మహేశ్వర్ , యూబీఐ ఆర్ఎం అరుణ సునీత, డిప్యూటీ రీజినల్ హెడ్ ప్రవీణ్ వేణుగోపాలన్, నమస్తే తెలంగాణ నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో ఇన్చార్జి జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
13
ఆటో షోకు విశేష స్పందన లభిస్తున్నది. మార్కెట్లో చాలా తక్కువ ధరలకే సన్రైస్ కియా కంపెనీకి చెందిన కరేన్స్, సోనెట్, సెల్టాస్ తదితర కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభం ధర రూ. 7 లక్షలు కాగా రూ. 20 లక్షల వరకు ఉన్నాయి. డీజిల్ వెర్షన్లో లీటర్‌కు 24 కి.మీ., పెట్రోల్ వెర్షన్లో లీటర్‌కు 19 కి.మీ ఇస్తాయి.
– సతీశ్, సన్‌రైజ్ కియా షోరూం జీఎం
ఆటోషోలో అన్ని షోరూముల కంపెనీలు ఒకే వేదికపై రావడం బాగున్నది. ఎస్బీఐ ఆధ్వర్యంలో 8.95 శాతం వడ్డీపై వంద శాతం ఆన్‌రోడ్ ప్రైస్ అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రాసెసింగ్ ఫీజును పూర్తి ఉచితంగా అందిస్తున్నాం. వ్యవసాయం, బిజినెస్, సెల్ఫ్ బిజినెస్ వారికి రుణాలు ఇస్తున్నాం.
– క్రాంతి, ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్
నమస్తే తెలంగాణ వారు ఏర్పాటు చేసిన ఆటోషోకు స్పందన బాగున్నది. ఆటోషోలో మా టీవీఎస్ వాహనాలను అమ్ముతున్నాం. సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ నంబర్‌వన్ స్థానంలో ఉన్నాయి.
– నానిబాబు, లక్ష్మీ టీవీఎస్ టీం లీడర్
ఆటోషోకు చాలా మంది సందర్శకులు వస్తున్నారు. వివిధ మోడళ్ల కార్లపై ఆసక్తి చూపుతున్నారు. టెస్ట్ డ్రైవ్ చేసి వివరాలను తెలుసుకుంటున్నారు. లోన్ సౌకర్యం అందుబాటులో ఉన్నది.
– మహేశ్, వరుణ్ మోటర్స్(ట్రూ వాల్యూ) సేల్స్ ఎగ్జిక్యూటివ్
మా షోరూంలో రూ. 88 వేల నుంచి రూ. 2 లక్షల 80 వేల ధరల్లో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఆటో షోలో వివిధ రకాల వాహనాలను అందుబాటులో ఉంచాం. స్కూటీ నుంచి బైక్స్ వరకు సందర్శకులు టెస్ట్ డ్రైవ్ చేసి, వాహనాల గురించి తెలుసుకుంటున్నారు.
– భరత్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వెంకటేశ్వర హీరో షోరూం
ఆటోషోలో నూతన టెక్నాలజీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. రూ. 1.34 లక్షల నుంచి ప్రారంభ ధర ఉన్నది. డౌన్ పేమెంట్ రూ. 30 నుంచి రూ. 35 వేలు కడితే వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆటో షో బాగున్నది.
– శ్రీకాంత్, టీం లీడర్, అతాల్ ఆరూస్ ఆటోమొబైల్స్
ఆటోషోలో సరికొత్త మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా వరుణ్ మోటర్స్ ఆధ్వర్యంలో సరసమైన ధరలకే వాహనాలను ప్రదర్శనలో ఉంచాం.
– వంశీ, వరుణ్ మోటర్స్ , నెక్సా టీఎం ఎగ్జిక్యూటివ్
తక్కువ ధరతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు వరుణ్ మోటర్స్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరల్లో మారుతీ సుజికీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆటోషోకు విశేష స్పందన లభిస్తున్నది.
– ఎం సంపత్, వరుణ్ మోటర్స్ టీం లీడర్
ఆటో షోలో కమర్షియల్ వాహనాలకు మంచి స్పందన లభిస్తున్నది. వాహనాల ప్రారంభ ధర రూ. 6.5 లక్షలు ఉన్నాయి. సీఎన్జీ వర్షన్ రూ. 7.5 లక్షలు ఉన్నది. వీటికి మంచి స్పందన కనబడుతున్నది.
– కిశోర్, ఫీల్డ్ ఆఫీసర్, వరుణ్ మోటర్స్ కమర్షియల్ విభాగం