Nizamabad | వినాయక నగర్, డిసెంబర్ 14 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి మద్ద మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ వీరంగం సృష్టించాడు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న సిబ్బందిపై ఆటోడ్రైవర్ ఎదురు తిరిగిన నిర్వాకంపై స్థానికులు నివ్వర పోయారు. ట్రాఫిక్ పోలీసులు, వన్ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి నగరంలోని భగత్ సింగ్ చౌరస్తా వద్ద ఓ ఆటో రోడ్డుపై నిలిపి ఉంచడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్బులు ఆటో డ్రైవర్ వద్దకు వెళ్లి రోడ్డుపై నుండి ఆటో తీయాల్సిందిగా సూచించాడు.
దీంతో మద్యం మత్తులో ఉన్న సదరు ఆటో వాలా మహమ్మద్ ఇర్ఫాన్ తనని ఆటో తీయమంటావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనను చూసిన స్థానికులు అక్కడ గుమ్మిగూడారు. ఆటో డ్రైవర్ ను పట్టుకొని సదర్ కానిస్టేబుల్ విషయాన్ని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటిన దేవి రోడ్డు చౌరస్తా వద్దకు వచ్చాడు. అనంతరం తనిఖీ చేయగా ఆటో డ్రైవర్ ప్యాంటు వెనుక భాగంలో నడుము వద్ద ఒక కత్తి, ఆటోలో తనిఖీ చేయగా మరో చిన్న కత్తి లభించినట్లు తెలిపారు.
తన నడుములో ఒక కత్తి ఆటోలో ఒక కత్తి (మారణాయుధాలు) పెట్టుకొని తిరుగుతున్న సదరు ఆటోవాలాకు డ్రంక్ అండ్ పరీక్షలు నిర్వహించగా మద్యం తాగి ఉన్నట్లుగా నిర్ధారణ అయినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. దీంతో అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, ఆటో సీజ్ చేసి సదర్ ఆటో వాలాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై మారణాయుధంతో తిరగబడి, విధులకు ఆటంకం కలిగించిన నమస్తే ఆటో డ్రైవర్ పై ట్రాఫిక్ కానిస్టేబుల్ అబ్బులు ఫిర్యాదు చేయడంతో, ఆటో డ్రైవర్ పై సిటీ పోలీస్ యాక్ట్ నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు.