కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి మోసపోకండి
కాంగ్రెస్ పార్టీ హామీలు, మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మాక్లూర్ మండలంలోని మానిక్‌బండార్, బోర్గాం(కే) గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి
ఆర్మూర్‌టౌన్/మాక్లూర్, ఫిబ్రవరి 9: కాంగ్రెస్ పార్టీ హామీలు, మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్టణంతోపాటు మాక్లూర్ మండలంలోని మానిక్‌బండార్, బోర్గాం(కే) గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేశానని తెలిపారు.
రైతు రుణమాఫీ, తులం బంగారం, రైతులకు బోనస్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని, ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేశాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో 2వ డివిజన్ అభ్యర్థి అశోక్, మాజీ జడ్పీటీసీ ఆకుల విజయ, నాయకులు ఆకుల రజనీష్, నర్సాగౌడ్, సురేశ్, గంగాధర్‌గౌడ్, కృష్ణ, రవీందర్‌నాయక్, రాము పాల్గొన్నారు. అంతకుముందు ఆర్మూర్‌లో నిర్వహించిన బైక్‌ర్యాలీలో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

