కామారెడ్డి, ఏప్రిల్ 2: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట గురువారం మహాధర్నా, వంటా-వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లను ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, విద్యుత్ సంస్థలోని పీస్ రేట్ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2026 పీఆర్సీని అమలుచేయాలని కోరారు.
వీరి ధర్నాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్లు సంఘీభావం తెలిపాయి. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ హరికృష్ణ, జిల్లా కో-కన్వీనర్ భీమరాజ్, కామారెడ్డి డివిజన్ జేఏసీ చైర్మన్ సునీల్గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కిష్టాగౌడ్, డివిజన్ కన్వీనర్ రంజిత్ యాదవ్, జాయింట్ సెక్రటరీ రాఘవాచారి, శ్యామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.