ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
కంఠేశ్వర్/ డిచ్పల్లి, జూన్ 3: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీలో ఓట్ల లెక్కింపు నిర్వహిసున్నట్లు పేర్కొన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు సైతం ఇక్కడే జరిగిందని, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను జగిత్యాలలో లెక్కించగా ఈసారి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ సీఎంసీలోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్నివిధాలుగా సన్నద్ధం చేశామని పేర్కొన్నారు. 15రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని, మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉన్నదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ సెంటర్ రావాలని, జారీచేసిన ఎంట్రీపాసులతోపాటు ఏదైనా గుర్తింపుకార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. మొబైల్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతిలేదని స్పష్టంచేశారు. కౌంటింగ్ కేంద్రం చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

