నందిపేట్, మే 12: మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆలయం పలుగుట్ట ప్రాంగణంలో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శుక్రవారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాన్ని సకాలంలో పూర్తి చేయడానికి నిర్మాణకర్తలు నిష్టతో పని చేయాలని కోరారు. కేదారేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఆశ్రమ వ్యవస్థాపకుడు మంగిరాములు మహరాజ్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయాభివృద్ధి, రోడ్లు, ఇతర వసతుల కల్పన వంటి అంశాలపై మంగి రాములు మహరాజ్‌తో జీవన్‌రెడ్డి చర్చించారు.
కురుమ సంఘం ఫంక్షన్ హాల్ పనులు..
మండల కేంద్రంలో కొనసాగుతున్న నియోజకవర్గ స్థాయి కురుమ సంఘం ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించారు. ఈ హాల్ నిర్మాణానికి రూ.కోటీ 50 లక్షల నిధులను ఎమ్మెల్యే మంజూరు చేయించిన సంగతి విధితమే. ఫంక్షన్ హాల్ నిర్మాణ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ బీమా చెక్కు అందజేత
ఆర్మూర్, మే12: ఆలూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బేగరి రాజు ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందగా బాధిత కుటుంబ సభ్యులను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమాకు సంబంధించిన రూ 2లక్షల చెక్కును అందజేశారు. అధైర్య పడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తర్వాత ఆలూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పనులను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ నిర్మాణానికి మంజూరైన రూ15లక్షల ప్రొసీడింగ్ పత్రాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆలూర్ సర్పంచ్ కళ్లెం మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ మెట్టు సంతోష్, పండిత్ ప్రేమ్ పాల్గొన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కల్యాణ మండపాల్లో జరిగిన వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆయన సతీమణి రిజితారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఆధార్ కేంద్రం ప్రారంభం
ఆర్మూర్ తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజనరేందర్, మాజీ వైస్ ఎంపీపీ ఈ గంగాధర్, పండిత్ ప్రేమ్, శ్రావణ్, సయీద్ తదితరులు పాల్గొన్నారు.