BRS | ఆర్మూర్ టౌన్ : బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి జరిగింది ఏమీ లేదని బీఆర్ఎస్ నాయకుడు లతీఫ్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని 17వవార్డులో బీఆర్ఎస్ నాయకుడు షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఓటర్ జాబితా ప్రకారం సోమవారం ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లతీఫ్ మాట్లాడుతూ ఓటర్ లిస్ట్ జాబితాను ఇంటింటికి వెళ్లి పేర్లను ఓటర్ లిస్టులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.
పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వార్డు అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదని, భవిష్యత్లో కూడా అవుతుందనే నమ్మకం లేదని అన్నారు. మరో రెండు సంవత్సరాలల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కావున రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే ఇది సాధ్యమని, కావున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఆర్మూర్ మున్సిపల్ పై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగర ఖాయమన్నారు.