Nizamabad | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం సార్వజనిక్ దేవి ఉత్సవ కమిటీ నియామకం చేశారు. కమిటీ అధ్యక్ష పదవికి సురేష్, శ్యాం, పవన్, మహేష్ పోటీలో ఉండగా, పుర ప్రముఖులు సమన్వయంతో అధ్యక్షుడిగా నంద్యాల శ్యాంను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శిగా రాజులదేవి పవన్ కుమార్, కోశాధికారిగా ఉద్మీర్ సందీప్, ఉపాధ్యక్షుడిగా మాసుల సురేష్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు నంద్యాల శ్యాం మాట్లాడుతూ అందరి సహకారం, సమన్వయంతో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని, తనను అధ్యక్షుడిగా చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాలయం కమిటీ చైర్మన్ హరికాంత్ చారీ, గుమ్మల అశోక్ రెడ్డి, రుద్ర సత్యనారాయణ, శంకర్ రెడ్డి, పూజారి లింగం, బెంజర్ గంగారాం, మాసుల శ్రీనివాస్ గడ్డం సాయిలు, గంగారం, గుంత గంగాధర్, గమరపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ప్రముఖులు, సభ్యులు పాల్గొన్నారు.