నిజామాబాద్ స్పోర్ట్స్/జక్రాన్‌పల్లి, జనవరి 4: ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలంలోని అర్గుల్ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ గురువారం పరిశీలించారు.
నిర్దేశిత గడువులోగా దరఖాస్తు వివరాల నమోదు పూర్తయ్యే లా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, నోడల్ అధికారి తిరుమల ప్రసాద్, మండల ప్రత్యేకాధికారి ఉన్నారు.