డిచ్పల్లి, డిసెంబర్ 31 : సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకుల పాఠశాలల్లో 2025 సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు టీజీసెట్-25కు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారిణి మాధవీలత తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు www.tswreis.ac.in లేదా http:// tgcet.cgg. gov.in వెబ్సైట్ ద్వారా రూ. వంద చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను ఫిబ్రవరి ఒకటవ తేదీలోగా సమర్పించాలని, ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.