హైదరాబాద్ : ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై(Constable Soumya) దాడి కేసులో పరారీలో ఉన్న నిందితుడు మతిన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన రోజే సఫియుద్దీన్, సయ్యద్ సోహైల్‌ను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు తాము ప్రయాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టగా, ఆమెకు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
ఆమె ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. సౌమ్య శరీరంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఓ కిడ్నీ తొలగించామని వైద్యులు తెలిపారు.