బాన్సువాడ, మార్చి 28: బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు. నస్రుల్లాబాద్ అంగన్వాడీ సూపర్వైజర్ వేధింపులకు బొమ్మన్దేవ్ పల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ సువర్ణ ఫినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నం చేసుకోగా..ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ ఖలీల్ మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారుల వేధింపులు ఆపాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సురేజ్గొండా, ప్రాజెక్టు అధ్యక్షురాలు మహాదేవి, కార్యదర్శి రాధ, రేణుక, వజ్ర తదితరులు పాల్గొన్నారు.