నస్రుల్లాబాద్, మార్చి 19: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు అతడి దిష్టిబొమ్మను నస్రుల్లాబాద్‌లో బుధవారం దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు గౌడ్, అఫ్రోజ్, సాయిలు, శంకర్, సాయి, మోసిన్, పోశెట్టి, రాజు, పోచయ్య, రమేశ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.