కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి(Kotagiri) మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన (2001-2002 ) విద్యార్థులు (Old Students) 23 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన గురువులు వెంకటసుబ్బయ్య, వర కుమారి, ఆశాజ్యోతి, రమేష్‌ను , కోటగిరి మండల ఇన్చార్జి ఎంఈవో శ్రీనివాస్ రావును శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.