Formers | కోటగిరి : వానకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని కోటగిరి మండల తహసీల్దార్ గంగాధర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి సహకార సంఘం గోదాంలో ఎరువుల నిలువలను పరిశీలించారు.
వివిధ రకాల ఎరువుల స్టాక్‌పై సహకార సంఘం సీఈవో కమలేష్ ను అడిగి తెలుసుకున్నారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రశీదులు కచ్చితంగా రైతులకు ఇవ్వాలన్నారు. తహసీ గంగాధర వెంట కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజు ఉన్నారు.