వేల్పూర్/మెండోరా/ముప్కాల్/భీమ్‌గల్, సెప్టెంబర్ 6: బాల్కొండ నియోజకవర్గంలోని ఉరూరా అభివృద్ధి, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన మంత్రి ప్రశాంత్రెడ్డికే పల్లెలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వేముల గెలుపుకోసం ప్రజలంతా స్వచ్ఛందంగా తీర్మానం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు, కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయగా.. తాజాగా మెండోరా, ముప్కాల్, వేల్పూర్, భీమ్‌గల్ మండలాలకు చెందిన పలు కుటుంబాలు బీఆర్ఎస్కే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేశాయి.
వేల్పూర్ మండలంలోని వాడీ గ్రామంలో ఎస్సీ మాల సంఘానికి చెందిన 73 కుటుంబాలు వేములకు మద్దతుగా బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి. సంఘ సభ్యులు తీర్మానం చేసిన కాపీని వేల్పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అందజేశారు.
వడ్డెర సంఘం ప్రతిజ్ఞ..
మెండోరా మండలం ఎల్కటూర్ గ్రామానికి చెందిన వడ్డెర సంఘం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటేసి ప్రశాంత్‌రెడ్డిని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. ఈ మేరకు సంఘానికి చెందిన కుటుంబాలన్నీ తీర్మానం చేసిన కాపీని సర్పంచ్ సామ గంగారెడ్డి, ఉపసర్పంచ్ విద్యాసాగర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశాయి. కార్యక్రమంలో లక్ష్మణ్, నర్సయ్య, శ్రీను, కృష్ణ, రాజు, నరేశ్, శంకర్, నితిన్, శశి, మల్లేశ్ పాల్గొన్నారు.
51 మాదిగ సంఘం కుటుంబాల తీర్మానం..
ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో మాదిగ సంఘానికి చెందిన 51 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కట్టుబడి ఉన్నామని తీర్మానం చేశారు. ప్రశాంత్‌రెడ్డి గెలిస్తే పల్లెలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సామ వెంకట్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ, నాయకులు డాక్టర్ నవీన్ తదితరులు
బీఆర్ఎస్కే మున్నూరుకాపు సంఘం..
రైతుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి అండగా ఉంటామని భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన మున్నూరుకాపు సంఘం-1 సభ్యులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటేస్తామని 35 మంది సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి, కాపీని పార్టీ గ్రామశాఖ యువజన విభాగం అధ్యక్షుడు ఒజ్జం రమేశ్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూమేశ్వర్ పాల్గొన్నారు.