మోర్తాడ్/బాన్సువాడ, డిసెంబర్ 16: పల్లె పోరు తుది అంకానికి చేరింది. స్థానిక సంస్థల సమరంలో ఆఖరిదైన మూడో విడుత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 20 మండలాల్లో 333 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆయా జీపీల్లో ఏకగ్రీవాలు పోనూ మిగిలిన స్థానాల్లో బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటించనున్నారు. ముందుగా వార్డులు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం రెండు జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రానికే పోలింగ్ సిబ్బంది గ్రామాలకు చేరుకున్నారు.
పటిష్ట బందోబస్తు..
తుది విడుత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుంగా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. కామారెడ్డి జిల్లాలో 18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి, అక్కడ భద్రతను పటిష్టం చేశారు. ముగ్గు రు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 20 మంది ఎైస్సె లు, ఏఎైస్సెలు సహా 600 మందికి పైగా సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐ లు, ఎస్సైలు, ఇతరత్రా సిబ్బంది కలిపి 1100 మం దికి పైగా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ప్రజ లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు. 60 సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా పెట్టామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లోని 12 మండలాల్లో జరుగను న్న తుది విడుత ఎన్నికల్లో దాదాపు 2.80 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, ముప్కాల్, బా ల్కొండ, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూ ర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో మొత్తం 165 జీపీలు ఉన్నాయి. అయితే, 19 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 146 స్థానాల్లో 562 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,620 వార్డుస్థానాలు ఉండ గా 490 స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 1, 130 స్థానాల్లో 3,382 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లో (బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డొంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్) తుది విడత ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 168 సర్పంచ్, 1,482 వార్డు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగ తి తెలిసింది. అయితే, 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 142 స్థానాల్లో 462 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,482 వార్డులకు 449 ఏకగ్రీవమయ్యాయి. 13 వార్డుల్లో నామినేషన్లు రాలేదు. మిగిలిన 1,020 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుండగా, 2,790 మంది ఆభ్యర్థులు బరిలో ఉన్నా రు. ఆయా స్థానాల్లో బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి తీసుకున్న పోలింగ్ సిబ్బంది సాయంత్రానికి గ్రామాలకు చేరుకున్నారు.

Dd