మోర్తాడ్, మే 5: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కమ్మర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఐక్యరైతుసంఘం జిల్లా అధ్యక్షుడు సారాసురేశ్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం.. గిరిజనులు, రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, గిరిజనేతరులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు, రైతుభరోసా, వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే, గత ప్రభుత్వం చేసిన అప్పుల ఊబిలో కూరుకుపోయామని సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ఐ శరత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, అశోక్, శ్రీనివాస్, ముత్తెన్న, గోవింద్, శంకర్, నర్సయ్య, ముత్తెన్న, బడెసాబ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.