Urea tokens | ఆర్మూర్ టౌన్: పోలీస్ శాఖ అధికారుల ప్రొటెక్షన్ మధ్య వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా టోకెన్లు వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సొసైటీలో రైతులు మంగళవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వ్యవసాయ శాఖ అధికారులు సొసైటీ కార్యాలయం ముందు బుధవారం రైతులు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో రైతులకు పోలీస్ బందోబస్తు మధ్య వ్యవసాయ శాఖ అధికారులు యూరియా టోకెన్లు అందజేశారు.
వర్షాకాలం ఉందని తెలిసి కూడా అధికారులు యూరియాను డంపు చేసుకోకపోవడం తోనే ఈరోజు ఇలాంటి సమయం వచ్చిందని పలువురు రైతులు మండిపడుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామని ఇక్కడి అధికారుల ఉన్నతాధికారులకు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కానీ తమకు సొసైటీలలో యూరియాను అందించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీపై అధికారులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.