ఖలీల్వాడి, డిసెంబర్ 24 : బ్యాంకు ఖాతా, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పొద్దని అదనపు కలెక్టర్ యాదరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ యాదగిరి హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆన్లైన్ షాపింగ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తప్పుడు ప్రకటనలకు ఆకర్షితులై మోసపోవద్దన్నారు. వినియోగదారులు అపప్రమత్తంగా ఉండాలని సూచించారు.