బాన్సువాడ రూరల్/ నస్రుల్లాబాద్/ నిజాంసాగ ర్, జూన్ 21 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాన్సువాడ మండలంలోని జక్కల్‌దాని తండా ప్రాథమిక పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టి పూర్తి చేయాలని చెప్పారు.
అనంతరం గ్రామంలో చేపడుతున్న మిషన్‌భగీరథ సర్వే వివరాలను ఎంపీడీవో బషీరుద్దీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పండరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ సర్వే వందశాతం పూర్తి చేశామని వారు కలెక్టర్‌కు విరించారు. ఆయన వెంట డీఎల్పీవో నాగరాజు, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, మండల విద్యాధికారి నాగేశ్వర్రావు తదితరులు ఉన్నారు. నస్రుల్లాబాద్‌లోని నర్సరీని, అమ్మ ఆదర్శ పాఠశాలను అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నీలావతి, ఎంపీవో రాము, ఏపీవో సౌజన్య, పంచాయతీ కార్యదర్శి రాజేశ్ తదితరులు ఉన్నారు. నిజాంసాగర్లోని ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈనెల 26వ తేదీ వరకు పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.