మాక్లూర్/ఖలీల్వాడి, జూలై14: గురుకుల పాఠశాల వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల ఆర్సీవో సత్యనారాయణరెడ్డితో కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఈశ్వరి, గౌతమిని అదనపు కలెక్టర్ అంకిత్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.