వినాయక్‌నగర్, మే 28: మహిళల ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న నిజామాబాద్ నగరంలోని పోచమ్మగల్లిలో ఉన్న స్కానింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సెంటర్ ఎదుట మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అనంతరం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు మాట్లాడుతూ పోచమ్మగల్లీలోని అయ్యప్ప డయాగ్నోస్టిక్ సెంటర్లో కంప్యూటర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నీలిప్రసాద్ మహిళల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఈ నెల 8న తమకు ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదు చేసుకొని ప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఖలీల్‌వాడి, మే 28: అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నలుగురు వైద్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించినట్లు డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్ తెలిపారు. కమిటీలో జీజీహెచ్ గైనిక్ హెడ్ ఆఫ్‌ది డిపార్ట్మెంట్ డాక్టర్ అనుపమ, అసిస్టెంట్ ప్రొఫెసర్(రేడియాలజీ) జీజీహెచ్ డాక్టర్ శ్రావణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంజన, ఎంసీహెచ్ సర్వీసెస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ లావణ్య ఉన్నారు. వీరు ఏడు రోజుల్లో కలెక్టర్‌కు నివేదిక అందించనున్నారు.