ACB trop | మక్లూరు : ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చేందుకు లచం అడగడంతో ఓ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన నిజాబాద్ జిల్లా మక్లూరు మండలంలోని గొట్టముక్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. గొట్టముక్ల గ్రామంలో ఓ ఇంటి నిర్మాణానికి ఆ గ్రామ కార్యదర్శి మోహన్ లంచం కింద డబ్బులు ఇవ్వాలని బాధితుడిని డిమాండ్ చేశాడు. కాగా అతడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వల పన్ని బాధితుడి నుండి రూ.18 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.