మాయమాటలు చెప్పి..
గ్రామీణ ప్రాంత ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు. జన సందోహం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు.
- వృద్ధురాలి నుంచి బంగారు నగలు అపహరణ
- రెంజల్ మండలం నీలా గ్రామంలో ఘటన
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రెంజల్, జనవరి 19: గ్రామీణ ప్రాంత ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు. జన సందోహం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా రెంజల్ మండలం నీలా గ్రామంలో పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఆఫీసర్లు వస్తున్నారంటూ ఓ వృద్ధురాలిని నమ్మిం చి ఆమె చెవులకు ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలా గ్రామానికి చెందిన అంబెం పోసాని అనే వృద్ధురాలు తన కొడుకు, కోడలు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లడంతో ఇంటి గడప వద్ద కూర్చున్నది. ఇంతలో అక్కడికి హెల్మెట్ ధరించిన ఓ దుండగుడు బైక్‌పై వచ్చి వృద్ధురాలి ఇంటిముందు నిలిపాడు. పేదవృద్ధులను గుర్తించి పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఆఫీసర్లు వస్తున్నారని, పాన్‌కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ కావాలని, ఒంటిపై బంగారం తీసివే యాలని వృద్ధురాలికి సూచించాడు. వృద్ధురాలిని మ రింత నమ్మించడానికి అక్కడే ఉన్న అర్చన అనే బాలికకు రూ.50 ఇచ్చి పాన్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని పంపించాడు.
అనంతరం వృద్ధురాలు తన చెవులకు ఉన్న 12 మాసాల బంగారు నగలను ఓ కవర్లో ఉంచి, ఇంట్లో దాచాలంటూ దుండగుడి చేతికిచ్చింది. దీంతో దుండగుడు ఆమె ఇంట్లోకి వెళ్లి నగలను జేబులో దాచుకొని కవర్‌ను మాత్రమే అక్కడ ఉంచి పరారయ్యాడు. కాసేపటికి జిరాక్స్ తీసుకొని వచ్చిన అర్చన.. ఇంట్లోకి వెళ్లి చూడగా కవర్ మాత్రమే ఉండడంతో దుండగుడు నగలను ఎత్తుకెళ్లినట్లు వృద్ధురాలు తెలుసుకొని బోరున విలపించింది. విషయం తెలుసుకొన్న రూరల్ సీఐ శ్రీనివాస్‌రాజు, రెంజల్ ఎస్సై పి. ఉదయ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వృద్ధురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నారు. చోరీకి పాల్పడిన దుండగుడిని గుర్తించేందుకు సీసీ కెమెరా పుటేజీలు,ఆధారాలను సేకరించడానికి మూడు బృందాలను రంగంలోకి దించినట్లు రూరల్ సీఐ తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

