మద్నూర్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని (Womens Day) ఘనంగా జరుపుకుంటున్నారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన మహిళలను సన్మానిస్తూ వారి సేవలను కొనియాడుతున్నారు. మద్నూర్ ( Madnoor ) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా ( Art Teacher ) పనిచేస్తున్న బాలకిషన్ కూరగాయలతో ( Vegetables ) మహిళా చిత్రపటం తయారు చేశారు.
సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమైనదని ఆయన అన్నారు. కూరగాయలతో రూపొందించిన చిత్రాన్ని చూసి పలువురు ఆయనను అభినందించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో మహిళలను గౌరవించాలని ఆయన కోరారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్సై విజయ్ కొండ ( SI Vijaykonda ) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారని తెలిపారు. పోలీస్ వృత్తిలో సైతం మహిళలు రాణిస్తూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని తెలిపారు. కానిస్టేబుళ్లు ప్రియాంక , నవ్య, సుజాతను శాలువాతో సన్మానించారు.