land issue | కంటేశ్వర్, నవంబర్ 3 : నిజామాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో సోమవారం అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్, సాలంపాడు కు చెందిన జయమ్మ అనే మహిళ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
జయమ్మ తన రెండెకరాల భూమిలో ఒకటిన్నర ఎకరం అమ్మగా మిగిలిన అర ఎకరం భూమి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి భూమిలోకి రాకుండా అడ్డుపడుతున్నాడని, కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్న కూడా తనను ఇబ్బందుల గురిచేస్తూ చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు దయచేసి భూమి సమస్య తీర్చాలని వేడుకుంది. పురుగుల మందు డబ్బాను గమనించిన పోలీసులు డబ్బాను స్వాధీనం చేసుకోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.