BRS silver jubilee | బాన్సువాడ, ఏప్రిల్ 13 : ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభకు బాన్సువాడ నియోజక వర్గం నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఅర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుభేర్ కోరారు. బాన్సువాడ పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చలేదని, గతం లో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రైతులను రాజులను చేస్తే, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ ది కేవలం అధికారం మాత్రమే పోయిందని, ప్రజల గుండెల్లో అభిమానం పోలేదని అన్నారు. వరంగల్ సభకు పెద్దమొత్తం లో తరలించేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలని చెప్పారు. ఈ నెల 15న బాన్సువాడలోని భారత్ గార్డెన్ లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరవుతారని, కావున కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు.
బోనస్‌పై పోచారం మౌనం వీడరేం..
బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి మండలంలో ఆరుగాలం శ్రమించి రైతులు పంటలు పండించి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను విక్రయిస్తే, రైతుల బోనస్ డబ్బులను కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాజేశారని బీఅర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారాం శ్రీనివాస్ రెడ్డి మౌనంగా ఉండడం వెనుక అంతర్యం ఏంటని జుబేర్ ప్రశ్నించారు. వెంటనే రైతుల బోనస్ డబ్బులను తీసుకున్న వారిపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కల్తీకల్లు బారిన పడి వందమంది ఆస్పత్రిలో చేరినా కనీస చర్యలు తీసుకోకపోవడంతపై మండిపడ్డారు. గౌడన్నలను కొంతమందిని కక్ష పూరిత రాజకీయాలు చేయడం తప్ప, అసలు ఆబ్కారీ శాఖ అధికారులపై చర్యలు శూన్యం అని ఆయన ఎద్దేవా చేశారు. కల్తీ కల్లు వ్యవహారంపై విచారణ చేపట్టి అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మోచి గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్, శివసూరి, అప్రోజ్, టేకుల్లా సాయిలు, సంజయ్ యాదవ్, రజాక్, గోపాల్, సంజీవ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.