పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో నడిచే వాహనాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఓ వ్యక్తి బ్యాటరీ సైకిల్ నడుపుతూ కనిపించాడు. అతనిని ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా.. తన పేరు ఎండీ సయీద్, లింగంపేట గ్రామమని తెలిపాడు.
ప్రైవేట్ జాబ్ చేస్తున్న తాను విధుల్లో భాగంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, నిజామాబాద్, ఆర్మూర్ వరకు వెళ్లాల్సి వస్తుందన్నారు. రోజూ సుమారు 50 నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణించాలని, పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితుల్లో బైక్‌పై వెళ్లలేక.. తక్కువ బడ్జెట్లో బ్యాటరీ సైకిల్‌ను కొన్నట్లు చెప్పాడు. రూ.40వేలతో కొనుగోలు చేసిన ఈ సైకిల్‌కు మూడు గంటలు చార్జింగ్ చేస్తే 100కి.మీ ప్రయాణించవచ్చని తెలిపారు.
-ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 13