Doddi komuraiah | పోతంగల్ జులై 4: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని మండల ప్రజలు, కురుమసంఘాల నాయకుల ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ, విముక్తి కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాటం మరువలేనిది ఆని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వర్ని శంకర్, గంట్ల విట్టల్, నాయకులు సీతాలే మోహన్, ఈరుగొండ, సితాలే విజయ్, భీంరావు పటేల్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.