Edapalli | ఎడపల్లి : ఎడపల్లి మండలం ఎంఎస్సీ పారం, బ్రాహ్మణపల్లి, దుబ్బ తాండ గ్రామాల్లో నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన అభ్యర్థులకు గ్రామస్తులతోపాటు, నాయకుడు సుధా నాగేందర్ శుక్రవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంఎస్సీ పారం జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, బ్రాహ్మణపల్లి పురమళ్ల హనుమంతు, దుబ్బ తండా మంగ్య నాయక్ నూతన సర్పంచులకు పూలమాలలతో సత్కరించి టపాకాయలు పేల్చి స్వీట్ పంచి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకుడు సుధా నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.