నిజామాబాద్ ఖలీల్ వాడి : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజశేఖర్ అనే వ్యక్తి ఆమెపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆ వీరాభిమాని తన రక్తంతో కవిత ఫొటో చేయించారు.
ఇవాళ రాజశేఖర్ హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి వెళ్లారు. అక్కడ ఆమెకు ఆమె ఫొటోను అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.