పసిపాపపై పైశాచికం
మద్యం మత్తులో ఆరు నెలల పసిపాపపై తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. పీకల దాకా మందు తాగి తన ఒడిలో ఉన్న తన బిడ్డను తీవ్రంగా కొట్టుకుంటూ భిక్షాటన చేసింది. గమనించిన మహిళలు దేహశుద్ధి చేసి ఆమెను పోలీసులకు అప్పగించారు. వివరాలు..
- మద్యం మత్తులో బిడ్డను కొడుతూ భిక్షాటన
నందిపేట్, ఏప్రిల్ 29 : మద్యం మత్తులో ఆరు నెలల పసిపాపపై తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. పీకల దాకా మందు తాగి తన ఒడిలో ఉన్న తన బిడ్డను తీవ్రంగా కొట్టుకుంటూ భిక్షాటన చేసింది. గమనించిన మహిళలు దేహశుద్ధి చేసి ఆమెను పోలీసులకు అప్పగించారు. వివరాలు.. నందిపేట్ బస్టాండ్ వద్ద సోమవారం ఓ యాచకురాలు తన బిడ్డను చంకలో వేసుకుని భిక్షాటన చేసింది. ఎవరైనా భిక్షం వేయకపోతే తన చంటి బిడ్డను ఇష్టమొచ్చినట్లు కొడుతూ మూర్ఖంగా ప్రవర్తించింది. అప్పటికే పసిపాప కాళ్లకు గాయాలై కట్లు కట్టి ఉన్నాయి. మద్యం మత్తులో పాపను కొట్టడమే కాకుండా డబ్బులు లేవన్నందుకు అక్కడున్న దుకాణాల్లో గందరగోళం సృష్టించింది. బస్టాండ్ వద్ద ఉన్న మహిళలు పాపను తీసుకొని మద్యం మత్తులో ఉన్న తల్లిని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పసిపాపకు సపర్యలు చేసేందుకు ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు రావడంతో పోలీసులు వారి వద్ద ఉంచినట్లు తెలిసింది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

