భిక్కనూరు, డిసెంబరు 28: ఇక్కడ కనిపిస్తున్న బండి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. భిక్కనూర్ పోలీసులు టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ వాహనంపై 42 చలాన్ల రూపంలో రూ. 43470 జరిమానా పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యజమానికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పెండింగ్ చలాన్లను చెల్లించినట్లు ఎస్సై ఆనంద్‌గౌడ్ తెలిపారు.