వినాయక నగర్,మార్చి : 18 నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident )తీవ్రంగా గాయపడిన బాలుడు మంగళవారం మరణించాడు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ, పోలీస్ లైన్ రోడ్డు నెంబర్-2 లో నివాసముండే సయ్యద్ షెహజాద్ (11) అనే బాలుడు జిజి కళాశాల వద్ద నుంచి సైకిల్ పై వెళుతుండగా అటువైపుగా వేగంగా వచ్చిన కారు సదరు బాలుడిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రైవేట్ దవాఖానలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు మంగళవారం మరణించినట్టు తెలిపారు. ఈ ఘటన పై బాలుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మూడో టోన్ ఎస్ఐ హరిబాబు రాజు కారు నడుపుతున్న హైదరాబాద్ కు చెందిన నాగ కిశోర్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.