Pothangal| పోతంగల్, డిసెంబర్ 11 : పోతంగల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన మొదటి విడత ఎన్నికల్లో 19 గ్రామాల్లో 82శాతం పోలింగ్ అయినట్లు అదికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సందర్శించి పరిశీలించారు.
మండలంలో 20 గ్రామాలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా 19 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. మండలంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రామాలలో మహిళలు 9018, పురుషులు 8668 ఉండగా మొత్తం 17,686 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.