వినాయక్ నగర్ (నిజామాబాద్ ) : నగరంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ ( Drunk Driving ) తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి కోర్టు ఏడు రోజుల సాధారణ కారాగార శిక్ష విధించిందని ఐదవ టౌన్ ఎస్సై సునీల్ ( SI Sunil ) వెల్లడించారు.
స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన సమయంలో షేక్ హబీబ్ అనే వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించగా అతడు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లుగా నిర్ధారణ అయినట్లు ఎస్సై వివరించారు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి బుధవారం ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా కోర్టు శిక్ష విధించిందని వెల్లడించారు.
కోర్టు ఆదేశాల మేరకు సదరు నిందితుడిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు డ్రైవ్ చేయవద్దని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.